పరుపుతో పాటు ఇచ్చే యాక్సిసరీస్ ఎలా వాష్ చేసుకోవాలి ?

V furniture mall వారు పరుపుతోపాటు జిప్ కవరు, దాని మీద టాపర్, ప్రొటెక్టర్, దాని మీద బెడ్ షీట్ ఇచ్చేవారు. ప్రస్తుతం online లో లేటెక్స్ కొనుగోలు చేసే వారికి పైన చెప్పిన వాటన్నిటితోపాటు, కొత్తగా అదనంగా AC కంఫర్టర్ ఇస్తున్నారు. ఇవే కాకుండా రెండు లాటెక్స్ పిల్లోస్ కానీ, ఫైబర్ పిల్లోస్ కానీ, కొనుగోలు చేసే పరుపును బట్టి ఇవ్వడం జరుగుతుంది.

ట్రాన్స్పో ర్ట్ కోసం వీటన్నిటికీ కలిపి ఒక కవర్ వేసి, దానిమీద పాత గోనెసంచి వేసి, దాని మీద మళ్లీ ఓ కొత్త గోనెసంచి వేసి, మొత్తానికి సీల్ వేసి, జాగ్రత్తగా రవాణా చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు తో ప్యాకింగ్ చేసినా, మొత్తంగా చూసుకుంటే వెయ్యిలో మూడు లేదా నాలుగు దాకా రవాణాలో పాడవడం జరుగుతుంది. అవి కూడా వినియోగదారులకు మరలా వాటిని మార్పు చేసి పంపించడం జరుగుతుంది.

అందులో ఎటువంటి సమస్య రాదు. పరుపు కంపెనీలో తయారు చేసిన తర్వాత వినియోగదారుడి దగ్గర చేరడానికి నాలుగైదు రోజులపాటు కవర్ లోపల గట్టిగా కుట్టేసి ఉంటుంది. లోపల ప్లాస్టిక్ వాసన ఉంటుంది. ఇంటికి చేరిన తర్వాత కవర్లు మొత్తం తీసేసి ఇంట్లో గాలి తగిలేలా ఒకటి లేదా రెండు రోజులు విడిగా ఉంచినట్లయితే, వాసన పూర్తిగా పోతుంది.

మంచం మీద వేసిన తర్వాత పరుపు పైన ఉన్న ఎలాస్టిక్ బెడ్ షీట్ ను ఒక్కసారి ఉతికి వేసుకోవడం మంచిది. సౌకర్యవంతంగా ఉండి పరుపులు చక్కగా పట్టి ఉంచుతుంది. అంతే కాకుండా మంచి క్లాత్ లని ఏమైనా తడపడం వలన అదనంగా వాటికి పట్టి ఉన్న రంగు వదిలిపోవడమే కాకుండా, బట్ట కొంచెం కొలత తగ్గిపోతుంది. అంటే షింక్ షేడ్ అవ్వడం.

దాని గురించి ఏమాత్రం దిగులు చందనవసరం లేదు. కంపెనీలో తయారు చేసిన తర్వాత క్లాత్ కి స్టార్చింగ్ తో ఫినిషింగ్ వస్తుంది ఒకసారి ఉతకడం వల్ల వాటిల్లోని స్టార్చ్ మొత్తం పోయి, పడుకున్నప్పుడు అంటి ఉన్న చమటను పీల్చేసుకొని చెడు వాసనను రానివ్వకుండా చేస్తుంది. మొదటిసారి ఉతికినప్పుడు కంఫర్ట్ తో కానీ లేదా పరుపు మీద వేసినప్పుడు సెంటు చల్లుకొని కానీ వాడుకోవచ్చు. ఇలా బెడ్ షీట్ ను ఉతికిన తర్వాత పరుపు మీద వేసుకోవచ్చు.

ఎలాస్టిక్ బెడ్ షీట్ కాబట్టి వేసుకోవడం సులభతరం అవుతుంది. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోయి సౌకర్యంగా ఉండటమే కాకుండా, చమటను కూడా పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. పడుకున్నప్పుడు హాయిగా ఉంటుంది అంతేకాదు, ఉతికిన తర్వాత బెడ్ షీట్ వేయడం వల్ల పరుపుకి మంచి గ్రిప్ ఉంటుంది. అదే ఉతకకపోతే బెడ్ షీట్ మంచం మీద వేశాక జారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే స్వచ్ఛమైన కాటన్ బట్ట మీద స్టార్చర్ లో ఉండడం దీనికి కారణం.

ఉపయోగించుకునే ముందు ఇలా ఉతుక్కోవడం చాలా మంచిది. బెడ్ షీట్ ను మొత్తంగా ఓ 50 సార్లు చక్కగా ఉతుక్కోవచ్చు. అంటే వారానికోసారి ఉతుక్కుంటే సంవత్సరం పాటు బెడ్ షీట్ ను ఉపయోగించుకోవచ్చు. అదే కనుక 15 రోజులకు ఒకసారి ఉతుక్కుంటే రెండు సంవత్సరాలకు మించి బెడ్ షీట్ ను వాడుకోవచ్చు. గత మూడు సంవత్సరాల నుండి అమ్ముతున్న ఈ ఎలాస్టిక్ బెడ్ షీట్ గురించి కంప్లైంట్ మాత్రం వినియోగదారుల నుండి రాలేదు.

ఇంకా కొంతమంది ఎలాస్టిక్ బెడ్ షీట్ చక్కని ప్రయోజనకరంగా ఉందని ఎక్కువ ఎక్కువగా వీటిని కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎలాస్టిక్ బెడ్ షీట్ ఒకటి ఉంటే చాలు. ఒక పాత బెడ్ షీట్ ను ఈ ఎలాస్టిక్ లో దూర్చుకుంటే అది కూడా ఎలాస్టిక్ బెడ్ షీట్ లా పనిచేస్తుంది. ఎలాస్టిక్ కోసం మళ్ళీ మళ్ళీ బెడ్ షీట్ ను కొనుగోలు చేయనవసరం లేదు.

దీని కింద ప్రొటెక్టర్ ఉంటుంది. ఇందులో పివిసి కోటింగ్ ఉంటుంది. వాటర్ ను పరుపు మీదకు రానివ్వకుండా అడ్డుకొని పరుపుని కాపాడుతూ ఉంటుంది. ఇది మంచి వెల్వెట్ క్లాత్ తో తయారు చేయబడి ఉంటుంది ఇది నీటిని కిందికి దిగకుండా కాపాడుతుంది. అయితే దీన్ని ఉతికేటప్పుడు బ్రష్ కొట్టకుండా జాగ్రత్తగా ఉతుక్కోవాలి. బ్రష్ కొట్టినా, బట్ట పిండేటప్పుడు మెలిపెట్టి తిప్పినా, దాని వెనుక ఉన్న పీవీసి కోటింగ్ పోతుంది. మిషన్ లో ఉతికి డ్రైయర్ పెట్టుకోవచ్చు.

దీన్ని గరిష్టంగా 30 సార్లు ఉతుకోవచ్చు. దాని కింద వేసుకునే టాపర్ సుమారు ఒక అంగుళం దాకా ఉంటుంది. దీనిని 15 సార్లు అయినా దీన్ని ఉతుక్కునే అవకాశం ఉంటుంది. పరుపుకు దగ్గరగా వెళ్లే కొద్దీ వేసే వాటి మందం ఎక్కువగా ఉంటుంది.ఎక్కువసార్లు ఉతికితే దీని వెనుక ఉన్న పొర పోయే ప్రమాదం ఉంటుంది. ఇక జిప్పు కవర్ ను ఐదు ఆరుసార్లు ఉతుక్కోవచ్చు.

ఇంకా ఎక్కువసార్లు ఉతకచ్చు కానీ, ఉతికే ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. జిప్పుల దగ్గర మెత్తదనం పోకుండా జాగ్రత్తగా ఉతుక్కోవాలి. కంపెనీ పరుపులకి ఇటువంటి సౌలభ్యం ఉండదు. పైన చెప్పినవన్నీ మిషన్లో వాష్ చేసుకుని డ్రైయర్లో పెట్టుకోవడం ఉత్తమం. బ్రష్షులు కొట్టడం, బట్టలు పిండడం లాంటివి చేయకూడదు. ఇలా జాగ్రత్తగా ఉతుక్కుంటూ వాడుకుంటే ఎన్నాళ్ళైనా ఉపయోగించుకోవచ్చు.

జిప్ కవరుపై మరక పడకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే పరుపు ఎన్ని సంవత్సరాలు అయినా ఉతికే అవసరం ఉండదు. స్వచ్ఛమైన లాటెక్స్ పరుపు 20 సంవత్సరాలు అయినా కూడా చక్కగా ఉంటుంది. ఏసీ కంఫర్టర్ వాషింగ్ మిషన్ పెద్దదిగా ఉంటేనే ఉతుక్కోవడానికి వీలుగా ఉంటుంది. దీని లోపల ఫైబర్ తో తయారు చేస్తారు. దీన్ని కూడా గరిష్టంగా 30 సార్లు ఉతు క్కోవచ్చు.

ఎండాకాలంలోనూ, ఏసీ ని ఎక్కువగా వాడేటప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడం మంచిది. పాత బెడ్ షీట్లు ఏమైనా ఉంటే దీనికి కవర్లు లా కుట్టించుకోవచ్చు. అప్పుడు గలేబులా దాన్ని ఉతుకోవచ్చు. అది పాడవకుండా ఉంటుంది. బెడ్ షీట్ తో పాటుగానే, పిల్లో కవర్లు వస్తాయి కాబట్టి బెడ్ షీట్ తో పాటు పిల్లో కవర్లు కూడా ఉతుకోవచ్చు ఇన్నర్ కవర్లను ఉతకకూడదు. ఇన్నర్ కవర్లతో పిల్లో వాడుకోకూడదు. అలా వాడితే మట్టి, జుట్టు, నూనె పిల్లోకి అతుక్కొని పిల్లో లోపల చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు ఇంకా వీటి గురించి వినియోగదారులకు కలిగే సందేహాలకు v furniture mall వారు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా అదనపు సమాచారం కోసం v furniture mall app ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు varamlatex.in websites ను చూడవచ్చు.

watch full video

Select an available coupon below